e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News అజ్మీర్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు ప‌ట్టివేత‌

అజ్మీర్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు ప‌ట్టివేత‌

అజ్మీర్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు ప‌ట్టివేత‌

అజ్మీర్ : ప్ర‌భుత్వం నిషేధించిన మందుల‌ను అమ్ముతున్న ఒక ముఠాను అజ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అజ్మీర్‌లోని ఓ గోదాం నుంచి దాదాపు రూ. 1.5 కోట్ల విలువ చేసే మందులు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకొని రామ్‌గంజ్ పోలీసులు విచారిస్తున్నారు.

రాజస్థాన్‌ అజ్మీర్ ప‌ట్ట‌ణంలోని బేవార్ రోడ్‌లో ఉన్న‌ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని ఓ గిడ్డంగిలో పెద్ద ఎత్తున మందులు, ఇంజెక్ష‌న్లు దాచి ఉంచిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దాంతో అజ్మీర్ రామ్‌గంజ్‌ పోలీసులు ఆ గోదాంపై దాడి చేసి 114 కార్ట‌న్ల మందుల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్ల విలువైన నిషేధిత మందులు, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ 100 ఎంజి, ట్రామాడోల్ ఇంజెక్షన్ 50 ఎంజి, ట్రామాడోల్ క్యాప్సూల్ 50 ఎంజి, ట్రామాడోల్ టాబ్లెట్ 50 ఎంజి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, ఆల్ప్రజోలం 1 ఎంజీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జ‌గ‌దీష్ చంద్ర శ‌ర్మ తెలిపారు. ఈ దాడుల్లో అజ్మీర్ అసిస్టెంట్ డ్ర‌ట్ కంట్రోల‌ర్ ఈశ్వ‌ర్ సింగ్ యాద‌వ్ బృందం కూడా పాల్గొన్న‌ది. స్వాధీనం చేసుకున్న మందుల‌న్నీ నిషేధించిన‌వి. కాగా, వీటికి బిల్లులు కూడా లేవని పోలీసులు గుర్తించారు. నిన్న‌నే జైపూర్‌లో ఇలాంటి నిషేధిత మందులు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 కోట్ల వ‌ర‌కు ఉంటుందని అంచనా.

విమల మార్కెట్లో విచారణ

అజ్మీర్‌లోని ఔషధాల హోల్‌సేల్ వ్యాపారం న‌డిపే విమల మార్కెట్‌లో పోలీసులు త‌నిఖీలు జ‌రుపుతున్నారు. విమల మార్కెట్‌లోని కొంతమంది విక్రేతలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, మందులు జప్తు చేసిన కంపెనీలు ఏమంత‌ ప్రసిద్ధి చెందిన‌ సంస్థలు కాక‌పోవ‌డం విశేషం. ఇటీవల, అజ్మీర్‌లోని పుష్కర్‌లో కూడా మందులు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో అజ్మీర్ నుంచి ఈ దందా కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ‌ పేరు కూడా..!

తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు

రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంప‌తులు

డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

అమెరికాలో మ‌రో న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంపై వివాదం.. తాజాగా వీడియో బ‌య‌ట‌కు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ

సెప్టెంబ‌ర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అజ్మీర్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు ప‌ట్టివేత‌

ట్రెండింగ్‌

Advertisement