త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా | దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

న్యూఢిల్లీ : దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్‌గానూ నిలువనుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా.. మరొకటి స్వదేశీ టీకా. కరోనాకు వ్యతిరేకంగా జైడస్ క్యాడిలా మరో స్వదేశీ టీకాపై పని చేస్తోంది. డీసీజీఐ అనుమతి ఇస్తే అందుబాటులోకి రానున్న నాలుగో టీకాగా నిలువనుంది. వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వీ టీకాలు రెండు డోసులు కాగా.. జైకోవ్ డీ వ్యాక్సిన్ మూడు డోసులు.
మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో మోతాదు, మూడో మోతాదు 56 రోజుల తర్వాత వేయనున్నారు. జైకోవ్-డీ డీఎన్ఏ ప్లాస్మిడ్ వ్యాక్సిన్ కాగా.. 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చు. కంపెనీ 200 మిలియన్ మోతాదులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు భాగస్వాములతో కలిసి పని చేస్తున్నది. ఆగస్ట్ – డిసెంబర్ మధ్య 50 మిలియన్ల జైకోవ్-డీ టీకాల లభ్యత ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

