నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్ | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి కర్నల్ సంతోష్ బాబు అమరుడయ్యారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు కొందరు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సంతోష్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం భీమరంలో రైతు వేదిక, వైకుంఠ దామం, హైస్కూల్ భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అలాగే ప్రజలకు మరిన్ని వైద్య సేవలు కల్పించేందుకు నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా రైతు వేదికను ప్రారంభించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

