Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Ranbir Kapoor | హైదరాబాద్ వేదికగా జరిగిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) ప్రీ-రీలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
Ranbir Kapoor | హైదరాబాద్ వేదికగా జరిగిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) ప్రీ-రీలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణ్బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలో రణ్బీర్ మొదట ఆంగ్లంలో మాట్లాడి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత సడన్గా తెలుగులోకి మారి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
“హైదరాబాద్కు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి” అంటూ రణ్బీర్ తెలుగులో మాట్లాడటంతో అక్కడున్న అభిమానులు కేరింతలు కొట్టారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని భావిస్తున్నానంటూ ఆయన సరదాగా నవ్వడం అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది. పక్కనే ఉన్న సాయిపల్లవి ఆయన తెలుగు ఉచ్ఛారణను విని ముఖంపై చిరునవ్వుతో ఎంతో ఆనందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో యష్ రావణాసురుడిగా నటిస్తుండగా, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాల్మీకి రామాయణం ఆధారంగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రెండు పార్టుల భారీ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న లాస్ఏంజిల్స్లోని అకాడమీ మ్యూజిమ్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 3డీ వరల్డ్ ప్రీమియర్ తర్వాత, నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Adorable to witness stars like #RanbirKapoor speaking in Telugu #Ramayana 🫶 https://t.co/3nAHF44PrY
— Sumanth (@SumanthOffl) October 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

