MLC Kavita : బీసీ కులగణన (Caste census) అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC K Kavita) విమర్శించారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికే మోదీ బీసీనా.. కాదా..? అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపారని ఆమె ఆరోపించారు.
రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? అని ఆమె ప్రశ్నించారు. బీసీల జనాభాను కరెక్టుగా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని, దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని అన్నారు.
ఆ ప్రాసెస్ చేయకుండా నరేంద్ర మోదీ కులం గురించి, రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడుకుంటున్నారని కవిత మండిపడ్డారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని హెచ్చరించారు. వంకర టింకర మాటలు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన 14 నెలల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తోందని ఆరోపించారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రంలో కేసీఆర్ను తలుచుకోని గుండె లేదని కవిత అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో, తన శక్తియుక్తులతో కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని చెప్పారు.
Cake blast | రీల్స్ కోసం రిస్క్.. బర్త్డే పార్టీలో పేలిన కేక్.. Viral video
Mahakumbh | మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. నెల రోజులలో ఏడోసారి
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు