Cake blast : ఈ మధ్య కాలంలో జనాల్లో రీల్స్ (Reels) పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడం కోసం జీవితంలో చోటుచేసుకునే ప్రతి సందర్భాన్ని రీల్స్‌గా మారుస్తున్నారు. రాత్రికే రాత్రే ఫేమస్ కావడం కోసం కొంతమందైతే తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి రిస్క్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడం కోసం ఓ వ్యక్తి కేకులో పటాసు పెట్టి పేలేలా చేశాడు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తాజా వీడియోలో కొంత మంది కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నారు. ఓ స్టూల్‌పై కేకు పెట్టి బర్త్ డే చేసుకుంటున్న అమ్మాయితోపాటు పలువురు కేకు ముందు నిలబడి ఉన్నారు. ఆ కేకుపై తామర పువ్వు ఆకారంలో ఉన్న క్యాండిల్ కూడా ఏర్పాటు చేశారు. బర్త్‌డే చేసుకుంటన్న అమ్మాయి క్యాండిల్ వెలిగించి వెంటనే వెనక్కి జరిగింది. కొన్ని క్షణాల తర్వాత కేకు ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను @sk465g అనే X (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ రీల్ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తే సంతోష వేడుక కాస్త విషాద వేడుక అయ్యే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. కేకుకు బదులుగా మీరు క్రాకర్స్ ఆర్డర్ చేశారా..? అని ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. కింది వీడియోలో కేకు పేలిన దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
लगता है केक अब्दुल की फैक्ट्री से मंगवाया था 😂😂. pic.twitter.com/NYVEt42jiD
— Weapon. (@sk465g) February 15, 2025
Mahakumbh | మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. నెల రోజులలో ఏడోసారి
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్‌కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు