MLC Kavitha : ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత (BRS chief) పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, విదేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐలు తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వేదికలు ఏర్పాటు చేసి కేకులు (Cakes) కట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (K Kavitha) కూడా తన తండ్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోగల వారి నివాసం సమీపంలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆలయానికి వెళ్లిన కవిత.. తన తండ్రి ఆయురారోగ్యం కోసం ప్రత్యేక పూజ నిర్వహించారు. కవిత పూజలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Hyderabad, Telangana: On the occasion of the birthday of BRS chief and Telangana’s first CM K Chandrashekar Rao, his daughter & MLC K Kavitha participated in special puja rituals held at the Veeranjaneya Swamy Temple, Nandi Nagar.
(Video Source: Office of K Kavitha) pic.twitter.com/uDNzZEo6CL
— ANI (@ANI) February 17, 2025
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్‌కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు