Mysuru | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం మైసూరు (Mysuru)లో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మృతులు విశ్వేశ్వరయ్య నగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి చేతన్ (45), అతని భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (62)గా గుర్తించారు.
ముందుగా చేతన్ తన తల్లి, భార్య, కుమారుడికి విషయం ఇచ్చి.. ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అప్పుల వాళ్ల ఒత్తిడి భరించలేకే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Ayodhya | అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు.. కిక్కిరిసిన శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్
Maha Kumbh | కుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 53 కోట్ల మంది పుణ్యస్నానాలు
Nita Ambani | ప్రధాని మోదీ, ముకేశ్ అంబానీపై ర్యాపిడ్ ఫైర్ ప్రశ్న.. నీతా అంబానీ సమాధానం ఇదే