Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) లో ఈనెల 15, 16 తేదీల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ.. అక్కడ జరిగిన ర్యాపిడ్ ఫైర్ (rapid fire question) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముకేశ్ అంబానీ గురించి నీతా అంబానీకి ప్రశ్న ఎదురైంది. వీరిద్దరిలో మీకు ఎవరు గొప్ప అని నీతాని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దేశానికి చాలా మంచి జరుగుతోంది’ అని తెలిపారు. ఇక తన భర్త ముకేశ్ అంబానీతో తన ఇంటికి మంచి జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా నీతా ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Neetha Ambani Usa
నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలతో గ్లోబల్ ఛేంజ్ మేకర్‌గా నీతా అంబానీ నిలుస్తున్నారని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు గాను బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన గవర్నర్ ప్రశంసాపత్రాన్ని నీతా అంబానీకి అందజేశారు. ఈ ప్రశంసా పత్రాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ చేతులమీదుగా నీతా అంబానీ అందుకున్నారు.
బోస్టన్‌లో నీతా అంబానీ.. వీడియో
Also Read..
Mukesh Ambani | ఆసియాలో అంబానీయే టాప్.. సంపన్న కుటుంబాల్లో రూ.7.85 లక్షల కోట్లతో అగ్రస్థానం
SBI | రుణగ్రహీతలకు ఎస్బీఐ శుభవార్త.. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రుణాలపై వడ్డీరేటు తగ్గింపు
బజాజ్ కన్జ్యూమర్ కేర్ చేతికి విశాల్ పర్సనల్ కేర్