హైబ్రిడ్ విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి : శాస్త్రవేత్తలు
దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు. రాజేంద్రనగర్‌లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏఐసీఆర్పీ ఆన్ వెజిటేబుల్ క్రాప్స్ ఐకార్-ఐఐవీఆర్, కూరగాయల పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జరిగిన అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పరిశోధన కేంద్రాలు పలు అంశాలపై నివేదికలు సమర్పించి పలు తీర్మానాలు ఆమోదించాయి.
ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వేరుకుళ్లు, అగ్గితెగులును తట్టుకునే హైబ్రిడ్ రకాలపై పరిశోధనలు జరుగాలని సూచించారు. ఇందుకోసం ఏఐ సహాయాన్ని తీసుకోవాలన్నారు. ఏఐసీఆర్పీ కేంద్రాల్లో వ్యాధి నిఘా డాటా, ఛాయాచిత్రాల రికార్డు కోసం జీపీఎస్ కో-ఆర్డినేటర్లు తప్పనిసరని తెలిపారు. ఇక్కడ ఐసీఏఆర్-ఏడీజీ సుధాకర్ పాండే, తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డీ రాజిరెడ్డి, ఏఎన్డీయూఏటీ వీసీ బీ సింగ్, ఐఐవీఆర్ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్‌బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, మాజీ వైస్‌చాన్స్‌లర్ లావాండే, ఎన్‌ఐఆర్‌సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

