Devendra Fadnavis : దేశవిదేశాల నుంచి నిత్యం ఎంతో మంది భక్తులు తిరుపతి (Tirupati) వేంకటేశ్వర స్వామి (Lord Venkateshwara) దర్శనానికి వస్తుంటారు. వారిలో రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు ఎందరో ఉంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM), బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తిరుమలకు వెళ్లారు. తన కుటుంబసభ్యులతో, సహచరులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫడ్నవీస్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలోకి వెళ్లిన ఫడ్నవీస్ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో తిరుపతి వేంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటని ఫడ్నవీస్ అన్నారు. ఇవాళ తిరుమలకు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పఢ్నవీస్ తిరుమలకు వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Maharashtra CM Devendra Fadnavis says, “…This Tirupati Balaji Temple is one the best-managed temples in the country…I took a darshan of Lord Balaji…” https://t.co/8oggODMkPn pic.twitter.com/XAEHJDxuQs
— ANI (@ANI) February 17, 2025
#WATCH | Andhra Pradesh: Maharashtra CM Devendra Fadnavis offered prayers at Venkateswara Temple, Tirumala today. pic.twitter.com/VpalEX4qlI
— ANI (@ANI) February 17, 2025
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్‌కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు