Peddi | రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ పెద్ది (Peddi). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా గా వస్తోన్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది నుంచి ఇప్పటికే విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ ఇండియాతోపాటు వరల్డ్‌వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కాగా మేకర్స్ ఇక సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 7:02 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా.. ఆలస్యమైంది.
బుచ్చి బాబు సాన ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ పనిలోనే ఉన్నా. ఈ రోజు ఎలాగైనా మనం పాట చూస్తాం.. కొంచెం ఆలస్యమైంది. అప్పటిదారా ఈ చిన్న క్లిప్‌ను చూడండి అంటూ సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ‘పాతేసుకోకోయలా నిన్నే నీ లోపలా..ఏ పాతికేళ్లకే నువ్వు బాధపడిపోకు రా..’ అంటూ సాగుతున్న ఈ పాట సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. అతి త్వరలోనే ఫుల్ సాంగ్ వస్తుందని చెప్పాడు బుచ్చిబాబు.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్ది ఏప్రిల్ 30న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Dear brothers..
Mee panilone unna….eeroju elagaina we will see the song. There is a slight delay.
Meanwhile, enjoy this small clip from the song.
Full song out shortly🔥#RaiRaiRaaRaa #Peddi pic.twitter.com/6gODcVfFv9
— BuchiBabuSana (@BuchiBabuSana) March 2, 2026
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!