Mahakumbh | మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. నెల రోజులలో ఏడోసారి
Mahakumbh | మహా కుంభమేళా (Mahakumbh) లో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలుచోట్ల మంటలు చెలరేగాయి.
Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) లో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలుచోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెబుతున్నారు. మంటలను పూర్తిగా అదుపు చేశామని తెలిపారు.
కల్పవాసీలు ఖాళీ చేసిన కొన్ని పాత గుడారాలలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సెక్టార్ 19లోని మోరి మార్గ్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. ముందుగా అక్కడి నుంచి జనాలను క్షేమంగా తరలించారు. అయితే అప్పటికే అయోధ్య ధామ్‌లోని లవకుశ్ ఆశ్రమం పూర్తిగా కాలి బూడిదైపోయింది. సాయంత్రం 5.45 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేటప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. ఈ మంటల్లో భద్రతా సిబ్బందికి అవసరమైన వస్తువులు కూడా కాలిపోయాయి.
సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్‌లో ఉన్న గణేష్ ధామ్ ఉజ్జయిని ఆశ్రమం బాబా త్రిలోచన్ దాస్‌లో ఖాళీగా ఉన్న టెంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కానీ అప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పోలీస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగిందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపారు. సాధువు శిబిరంలో అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని చెప్పారు.
కాగా మహాకుంభమేళాలో అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి. 2025 జనవరి 19న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. గీతా ప్రెస్ క్యాంప్ అగ్నిప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 150కి పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. 2025 జనవరి 30న ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. 2025 ఫిబ్రవరి 7న శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్ 18లో మంటలు చెలరేగాయి. 2025 ఫిబ్రవరి13న కూడా మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.
2025 ఫిబ్రవరి 15న సెక్టార్ 18లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 2025 ఫిబ్రవరి 17న సెక్టార్ 8లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18లోని బజరంగ్‌దాస్ మార్గ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
ఇవి కూడా చదవండి..
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్‌కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

