బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 17:04:15

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పంజాగుట్ట, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలీంనగర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

పలు చోట్ల రోడ్లపై వర్షం నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామై వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలింగింది. రాబోయే 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవాకాశం ఉందని హైదరాబా‌ద్‌ వాతావరణ శాఖ తెలిపింది.


logo