SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్లు దంచుతున్నారు. హైదరాబాద్ బౌలర్లును చీల్చి చెండాడుతూ రజత్ పాటిదార్(50), విరాట్ కోహ్లీ(51)లు అర్ధ సెంచరీలు బాదారు. 65 పరుగులకే రెండు వికెట్లు పడిన జట్టును కోహ్లీ, పాటిదార్ ఆదుకున్నారు. పాటిదార్ అయితే.. బౌండరీలతో విజృంభించి రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఉనాద్కాట్ విడదీసి కమిన్స్ సేనను కాసింత ఊపిరి తీసుకోనిచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్(3)తో కలిసి కోహ్లీ మరో భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది. ఈ ఇద్దరూ.. ఆ తర్వాత దినేశ్ కార్తిక్ ఉండడంతో.. ఆర్సీబీ రెండొందలు కొట్టినా కొట్టొచ్చు.