e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home సినిమా 'ఎఫ్ 2' హిందీ రీమేక్‌లో హీరో ఇత‌డే..!

‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇత‌డే..!

'ఎఫ్ 2' హిందీ రీమేక్‌లో హీరో ఇత‌డే..!

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం ఎఫ్2..ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌. దిల్‌రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2019 సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ఎఫ్ 3 కూడా సెట్స్ పై ఉంది. ఈ ప్రాజెక్టును హిందీ రీమేక్ హ‌క్కుల‌ను బాలీవుడ నిర్మాత బోనీక‌పూర్ తీసుకున్నారు.

త్వ‌ర‌లోనే రీమేక్‌ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒక‌టి ఫిలినగ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. రీమేక్ లో ఆన్ ఆఫ్ ది మెయిన్ హీరో గా బోనీక‌పూర్ కొడుకు అర్జున్‌క‌పూర్ న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. తెలుగు వెర్ష‌న్ లో వ‌రుణ్‌తేజ్ పోషించిన రోల్‌లో అర్జున్ క‌పూర్ క‌నిపించ‌నున్నాడు.

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా వ‌స్తున్న ఈ సినిమాను అనీస్ బ‌జ్మీ డైరెక్ట్ చేయ‌నున్నాడు. అయితే వెంక‌టేశ్ రోల్‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న దానిపై మేకర్స్ త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నున్నార‌ని బీటౌన్ టాక్‌. త‌మ‌న్నా, మెహ‌రీన్ హిందీ వెర్ష‌న్ లో కూడా క‌నిపిస్తారా..? లేదా వేరే హీరోయిన్ల‌ను తీసుకుంటారా..అన్న‌ది తెలియాల్సి ఉంది.

Advertisement
'ఎఫ్ 2' హిందీ రీమేక్‌లో హీరో ఇత‌డే..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement