కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే విజయ్ స్టంట్ పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఇంధన ధరలను పెంచడానికి నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైకిల్ పై వెళ్లాడని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై విజయ్ అధికార ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ రోడ్డుమార్గంలో సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. విజయ్ ఇంటికి పోలింగ్ కేంద్రం దగ్గరుంది. అక్కడికి కారులో వెళ్తే పార్కింగ్ చేయడం కష్టంగా ఉండటం వల్ల సైకిల్‌పై వెళ్లాడని తెలిపారు. విజయ్ సైకిల్ రైడ్ పై వివాదం సృష్టించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ టైం మొదలైందని మరోసారి వార్తలు రాగా..వాటిని కొట్టిపారేశాడు.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్