కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లతోపాటు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.