దీపికాపదుకొనే, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘పికు’ సినిమా రాగా..ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇద్దరు స్టార్లు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. హాలీవుడ్ ఫిల్మ్ అడాప్షన్ (రీమేక్)గా వస్తున్న ది ఇంటర్న్‌లో కీ రోల్స్ చేస్తున్నారు దీపికా, బిగ్‌బీ. 2015 కామెడీ డ్రామాగా రాబర్ట్ డి నైరో, అన్నే హాతవే లీడ్ రోల్స్ లో ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కింది. నాన్సీ మేయెర్స్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్.
ఆన్లైన్ ఫ్యాషన్ వెబ్‌సైట్‌కు పనిచేసే 70 ఏండ్ల డి నైరో, కంపెనీ సీఈవో అయిన అన్నే హాతవే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మరి ఇపుడు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఆ పాత్రలతో ఇండియన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. దీపికాపదుకొనే ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.
ది ఇంటర్న్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి..