శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:32

రాష్ర్టానికి ‘నవోదయ’లు ఇవ్వండి

రాష్ర్టానికి ‘నవోదయ’లు ఇవ్వండి

  • జీరో అవర్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 22 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాల్సి ఉన్నదని, ఏడేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా స్పందించటం లేదన్నారు. 


logo