
(Rainwater Harvesting Pits) హైదరాబాద్: రాష్ట్రంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం ఇంకుడు గుంత నిర్మాణ వ్యయాన్ని పెంచింది. వీటి నిర్మాణానికి ప్రజలు స్వచ్చందంగా ముందుగా వస్తారని ప్రభుత్వం యోచిస్తున్నది. భూగర్బ జలాలను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఇండ్లల్లో దాదాపు 11 లక్షల ఇంకుడు గుంతలు నిర్మించినట్లుగా అధికార లెక్కలు చెప్తున్నాయి. మరో 40 లక్షల మేర నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేశారు. గ్రామస్తుల్లో అవగాహన, చైతన్యం తీసుకరావడం ద్వారా వీటి నిర్మాణాన్ని ఎక్కువగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ కార్యదర్శి ద్వారా ఈ పనులను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.4,150 నిర్మాణం వ్యయం ఉండగా, దానిని రూ.6,500కు పెంచారు. వీటికి అదనంగా ఉపాధి హామీ ద్వారా మూడు రోజుల పనిదినాలను కల్పిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఇంకుడు గుంతలను నిర్మించేందుకు వ్యయంగా రూ.12,750గా నిర్ణయించారు.
గ్రామాల్లో ఇంటి నుంచి నీరు రోడ్డుపైకి వచ్చే వారి ఇళ్లలో మొదటి ప్రాధాన్యతగా వీటిని నిర్మించనున్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కొ వ్యక్తికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా అందజేస్తున్నారు. దీంతో గ్రామాల్లో నీటి కొరత తీరి, వినియోగం పెరిగింది. రోడ్లపైకి నీరు పారబోయడం ద్వారా దోమల పెరుగుదలకు ఆస్కారమిచ్చి వ్యాధులకు గురవుతున్నారు. వీటన్నంటికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఇంట్లో వినియోగించిన నీటిని ఇంట్లోనే ఇంకుడు గుంతల ద్వారా భూమి పొరల్లోకి పోయేలా చేస్తే పరిశుభ్రంగా ఉండటంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల్ని నిర్మించాలని నిర్ణయించింది. గ్రామాలల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు అధికారులు సంసిద్ధులవుతున్నారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..