శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
Tips for Shrungaram: శృంగారం అనేది దాంపత్య బంధంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఆలుమగలిద్దరూ శృంగారాన్ని ఎంత ఇష్టంగా ఆస్వాదించగలిగితే వారి బంధం అంత బలంగా ఉంటుంది. అయితే యుక్త వయసులో దాదాపు అందరూ శృంగారాన్ని ఎంజాయ్ చేయగలిగినా.. వయసు మీదపడుతున్నా కొద్దీ కోరికలు సన్నగిల్లుతూ వస్తాయి. శృంగార కార్యాన్ని మమా అనిపించడం కూడా దానిపై కోరికలు మరింత సన్నగిల్లడానికి కారణమవుతుంది.

హైదరాబాద్: శృంగారం అనేది దాంపత్య బంధంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఆలుమగలిద్దరూ శృంగారాన్ని ఎంత ఇష్టంగా ఆస్వాదించగలిగితే వారి బంధం అంత బలంగా ఉంటుంది. అయితే యుక్త వయసులో దాదాపు అందరూ శృంగారాన్ని ఎంజాయ్ చేయగలిగినా.. వయసు మీదపడుతున్నా కొద్దీ కోరికలు సన్నగిల్లుతూ వస్తాయి. స్త్రీ పురుషులిద్దరిలోనూ వయసు పెరిగినా కొద్ది సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. వృద్ధాప్యంలో శృంగార సామర్థ్యం తగ్గిపోవడం సాధారణమే. కానీ, చాలామందిలో వృద్ధాప్యం ధరిచేరకముందే శృంగార కోరికలు సన్నగిల్లుతాయి. అంటే శృంగారంలో పాల్గొనే సామర్థ్యం ఉండి కూడా ఆసక్తిని కోల్పోతారు.
నలభై ఏండ్లు దాటేసరికి పిల్లల బాగోగులు, చదువులు, పెండ్లిండ్లు, భవిష్యత్తు లాంటి బాధ్యతలు మీదపడటంతో శృంగార కోరికలు తగ్గిపోతాయి. అడపాదడపా శృంగారంలో పాల్గొన్నా పెద్దగా సమయం కేటాయించరు. అలా శృంగార కార్యాన్ని మమా అనిపించడం కూడా దానిపై కోరికలు మరింత సన్నగిల్లడానికి కారణమవుతుంది. కాబట్టి శృంగారానికి కావాల్సినంత సమయం కేటాయించాలి. శృంగార కోరికలు సన్నగిల్లినా తిరిగి పెంచుకోవాలంటే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..?
జ్ఞాపకాలను నెమరువేసుకోవాలి
పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి దంపతులందరి ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది. పిల్లల భవిష్యత్తే వాళ్ల కండ్లముందు కదలాడుతుంటుంది. దానికితోడు అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. దాంతో శృంగారంపట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇలా తగ్గిపోయిన ఆసక్తి మళ్లీ పెరుగాలంటే మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. కాబట్టి అప్పుడప్పుడూ శృంగారం గురించిన ఆలోచనలు చేస్తూ ఉండాలి. పెండ్లయిన కొత్తలో శృంగారాన్ని ఎలా ఆస్వాదించేవాళ్లం, ఎలాంటి ఊసులు చెప్పుకునేవాళ్లం అనేవి గుర్తుచేసుకోవాలి. ఆ ఆలోచనలు మదిలో మెదలగానే కోరికలు గుర్రాలవడం ఖాయం. దంపతులిద్దరిలో ఒక్కరు ఇలా సిద్ధమైతే చాలు.. అవతలి వ్యక్తి అవలీలగా ఆ దారిలోకి వస్తారు.
ఫోర్ ప్లే చాలా ముఖ్యం
చాలామంది శృంగారం అంటే రతి కార్యమే అనుకుంటారు. కానీ ఆ కార్యానికి ముందు చేసే ఫోర్ ప్లే కూడా శృంగారంలో భాగమే. భాగస్వాములిద్దరూ శృంగార అనుభూతులను ఆసాంతం అనుభవించాలంటే ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఫోర్ ప్లే అనేది శృంగారంలో మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమను మరింత పెంచడంలో ఈ ఫోర్ ప్లే దోహదపడుతుంది. ఎందుకంటే ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయడంవల్ల ఆడ, మగ ఇద్దరిలో సెక్స్ హార్మోన్స్ పూర్తిగా విడుదలవుతాయి. ఇలా హార్మోన్లు పూర్తిగా విడుదలవడంవల్ల శృంగారాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు. కాబట్టి ఎంత ఎక్కువ సేపు ఫోర్ ప్లే చేయగలిగితే అంత ఎక్కువ అనుభూతి చెందవచ్చు.
చీకట్లో శృంగారం కరెక్టు కాదు
దంపతుల్లో చాలామంది శృంగారం సమయంలో లైట్లు బంద్ చేస్తారు. ఒకవేళ లైట్లు వేసివుంటే కళ్లు మూసుకుంటారు. కానీ ఇలా చేయడం కరెక్టు కాదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఇలా ఒకరినొకరు చూసుకోకుండా శృంగారంలో పాల్గొంటే రానురాను శృంగారంపట్ల ఆసక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శృంగారంలో పాల్గొనేటప్పుడు లైట్లు వేసుకుని, ఒకరినొకరు కళ్లల్లో కళ్లుపెట్టి తేరిపారా చూసుకుంటే మంచి అనుభూతి కలుగుతుందంటున్నారు. ఇలా శృంగారంలో ఒకరినొకరు తనివితీరా చూసుకోవడంవల్ల మనసులో ఆ జ్ఞాపకాలు మధుర స్మృతులుగా మిగిలిపోతాయని, అవసరమైనప్పుడు ఆ స్మృతులను గుర్తుకు తెచ్చుకోగానే కోరికలు పురివిప్పుతాయని సూచిస్తున్నారు.
తరచూ భంగిమలు మార్చాలి
పని ఏదైనా సరే ఎప్పుడూ ఒకేలా చేస్తూ పోతే బోర్ కొడుతుంది. శృంగారం కూడా అందుకు అతీతమైనది ఏమీ కాదు. అందుకే తరచూ శృంగార భంగిమలను మార్చాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు. తరచూ శృంగార భంగిమలను మార్చడం ద్వారా కొత్తకొత్త అనుభూతులు కలుగుతాయని, ఇలా ఎప్పటికప్పుడు నూతన అనుభూతులను ఆస్వాదించడం ద్వారా శృంగారంపై కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రాచీన గ్రంథం కామసూత్రలో శృంగారానికి సంబంధించి కావాల్సినన్ని భంగిమలు ఉన్నాయని, అయితే వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిలో అనువైన భంగిమలను ఆస్వాదించవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

