ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 18:08:55

ఈ నెల 12 నుంచి ఎంజీయూ గ్రాడ్యూయేష‌న్ ఫైన‌ల్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు

ఈ నెల 12 నుంచి ఎంజీయూ గ్రాడ్యూయేష‌న్ ఫైన‌ల్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు

న‌ల్ల‌గొండ : డిగ్రీ ఫైన‌ల్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 12 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ(ఎంజీయూ) తెలిపింది. ఎంజీయూ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ మిర్యాల ర‌మేశ్ మంగ‌ళ‌వారం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప‌రీక్షా స‌మ‌యాన్ని ఒక‌ గంట త‌గ్గించిన‌ట్లు చెప్పారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షా నిర్వ‌హ‌ణ స‌మ‌య‌మ‌న్నారు. 

సబ్జెక్టుల ప్రశ్నపత్రాలలో మార్పులు ఉంటాయన్నారు. ఒక విభాగం మాత్రమే ఉంటుందని విద్యార్థులకు వాటిలో ప్రశ్నల ఎంపిక ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నాల్గవ సెమిస్టర్ పరీక్షల‌ను సెప్టెంబర్ 13వ తేదీ నుండి ప్రారంభంకానున్న‌ట్లు వెల్ల‌డించారు. రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావచ్చ‌న్నారు. విద్యార్థులు ఫేస్ మాస్క్ ధరించి పరీక్షలకు హాజరు కావాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పారు. logo