బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:59

నేడు లక్ష మొక్కల జాతర

నేడు లక్ష మొక్కల జాతర

  • మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే కానుక 
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

జనగామ: జనగామ నియోజకవర్గవ్యాప్తంగా లక్షమొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే రోజున ‘హరిత’ కానుకనిద్దామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం నియోజకవర్గంలోని ప్రతి పల్లె పచ్చని మొక్కలతో పరవశించిపోవాలన్నారు. జనగామ పట్టణంలో జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు తమ తమ ప్రాంతాల్లో, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.


logo