పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరింత అనిశ్చితి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. తగిన సమయంలో ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీపై స్పందిస్తుందని రాజీవ్ స్పష్టం చేశారు.
కరోనా వల్ల గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిన మాట వాస్తవమేనని ఆయన అనడం గమనార్హం. అయితే 2022, మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో కేసుల సంఖ్య ఏకంగా 2.61 లక్షలను దాటింది.
నిజానికి కొవిడ్‌ను పూర్తిగా లేకుండా చేసే స్థితికి ఇండియా వచ్చిందని, అయితే యూకే, ఇతర దేశాల వేరియంట్లు దేశంలోకి ప్రవేశించడంతో పరిస్థితి మారిపోయిందని రాజీవ్ కుమార్ అన్నారు. సెకండ్ వేవ్ సేవల రంగంలాంటి వాటిపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద ఎత్తున పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రభావాలను ఆర్థిక శాఖ అంచనా వేసిన తర్వాత మరో ఉద్దీపన ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్‌రైజర్స్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్‌కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

