ముంబై: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఘనంగా వీడ్కోలు పలికింది. చేతి వేలు విరగడంతో స్టోక్స్ టోర్నీ మొత్తానికీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం రాత్రే అతడు ఇంటిదారి పట్టాడు. ఈ సందర్భంగా రాయల్స్ టీమ్ అతనికి ఓ ప్రత్యేకమైన జెర్సీ ఇవ్వడం విశేషం.
గతేడాది డిసెంబర్లో చనిపోయిన స్టోక్స్ తండ్రి గెడ్ పేరుతో ఉన్న జెర్సీ అది. రగ్బీ ప్లేయర్, కోచ్ అయిన గెడ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయాడు. ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ రాయల్స్ టీమ్ ఇలా స్పెషల్ జెర్సీని తయారు చేయించింది.
సీజన్ తొలి మ్యాచ్‌లోనే స్టోక్స్ ఎడమ చేతి వేలు విరిగిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గేల్ ఇచ్చిన క్యాచ్ పట్టబోయి స్టోక్స్ గాయపడ్డాడు. దీంతో అతనికి 12 వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
కేరళ అందాలను చూసి తన్మయత్వం చెందిన అనసూయ