Maharastra Navnirman Sena | మహారాష్ట్ర ద్రోహులకు మద్దతు ఇవ్వం.. తేల్చేసిన ఎంఎన్ఎస్..!
Maharastra Navnirman Sena | దేశంలో సమర్థ నాయకత్వం కోసం ప్రధాని మోదీకి మాత్రమే మద్దతు ఇస్తున్నామని శాలినీ ఠాక్రే పేర్కొన్నారు. కానీ సంజయ్ నిరుపమ్, రవీంద్ర వైఖర్ వంటి నాయకులకు మద్దతు ఇవ్వబోమని తెలిపారు.
Maharastra Navnirman Sena | సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే భేషరతుగా మద్దతు ఇస్తున్నామని, మహా కూటమికి కాదని ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి శాలినీ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ-శివసేన (షిండే)- ఎన్సీపీ (అజిత్ పవార్) సారధ్యంలోని మహా కూటమి తరఫున పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోమని తేల్చి చెప్పారు.

దేశంలో సమర్థ నాయకత్వం కోసం ప్రధాని మోదీకి మాత్రమే మద్దతు ఇస్తున్నామని శాలినీ ఠాక్రే పేర్కొన్నారు. కానీ సంజయ్ నిరుపమ్, రవీంద్ర వైఖర్ వంటి నాయకులకు మద్దతు ఇవ్వబోమని తెలిపారు. ‘ధనుష్యబాణ్’ చిహ్నంపై ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నేతలకు మద్దతు ఇవ్వమని ఎంఎన్ఎస్ను కోరడం సిగ్గుచేటని ఆమె ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ద్రోహి సంజయ్ నిరుపమ్, అవినీతి పరుడైన రవీంద్ర వైకర్ వంటి నేతలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. గుడిపడ్వా సందర్భంగా ఇటీవల జరిగిన సమావేశంలో ఎంఎన్ఎస్ వ్యవస్థాపక అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ దేశానికి సమర్థ నాయకుడి కోసమే ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

