Sonusood | తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ డమ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు సోనూసూద్. ఈ టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ సహిదేవ్, సంధ్య కాంబోలో వస్తోన్న ‘అనకాపల్లి’ (Anakapalli) సినిమాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిసిందే. రీసెంట్గా సోనూసూద్ మూవీలోని ‘డర్టీ గ్యాంగ్‌స్టర్’ సాంగ్ కూడా లాంచ్ చేశాడు. ఆగస్టు 7న సినిమా విడుదల కాబోతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ప్రమోషనల్ ఈవెంట్లో సోనూసూద్ మాట్లాడుతూ.. హీరోహీరోయిన్లతోపాటు తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారని.. అనకాపల్లి సినిమాను ఇక్కడి ప్రజలు సపోర్ట్ చేయాలని కోరాడు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానన్నాడు. ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టేలా చేయడం మీ అందరి బాధ్యత అన్నాడు సోనూసూద్.
ఇక అనకాపల్లి సినిమా కోసం వచ్చిన సోనూసూద్‌కు విక్రమ్ సహిదేవ్ ధన్యవాదాలు తెలియజేశాడు. డైరెక్టర్ త్రినాథ రావుతో నటించడం చాలా ఆనందంగా ఉందని.. ఈ మూవీని అనకాపల్లిలో షూట్ చేయడంతో తాను కూడా అనకాపల్లి కుర్రాడిని అయిపోయానని విక్రమ్ సహిదేవ్ అన్నాడు. తనను నమ్మి అమ్ము అనే పాత్రను ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ సంధ్యా వశిష్ఠ కృతజ్ఞతలు తెలియజేసింది. మా సినిమాలో అందమైన లవ్ స్టోరీతోపాటు ఫ్యామిలీ కూడా ఉంటుందని చెప్పింది.
ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో కీ రోల్లో కూడా నటిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
#SonuSood Is Confidently Saying That #Anakapalli Is Going To Be Good. pic.twitter.com/Jjb8Wiwqoe
— The South Cinemaa (@southcinemaaaa) August 6, 2026