KCR | కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌పై ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలను కేసీఆర్ కొట్టిపడేశారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును మీరే డిజైన్ చేశారా? అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మేం డిజైన్ చేయలేదు. వాళ్ల విజ్ఞానానికి వదిలేయాలి. మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇంజినీరింగ్ భాషే రాదు. రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదు’ అన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ.. ‘ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం పెట్టిన ప్రాజెక్టుల కెపాసిటీ 14 టీఎంసీలు. ఒక పంపు పోస్తే మరో పంపు అందుకోవాలి. కరెంటు పోతే గోవిందా. వాళ్లకు నీరిచ్చే ఉద్దేశం లేదు. కానీ, మేం నీళ్లు తీసుకోవాలి. 14 టీఎంసీలు కాదు.. రీ డిజైన్ చేయాలని అధికారులకు చెప్పాం. తెలంగాణ నేపథ్యంలో.. రాష్ట్రానికి నీళ్లు వచ్చేలా మలచాలని ఆదేశం ఇచ్చాను. దటీజ్ స్ట్రాటజీ బై కేసీఆర్. బైది గవర్నమెంట్. నీళ్లు రావాలని స్ట్రాటజీ చెప్పిన. సబ్జెక్టు ఏంటంటే.. నీళ్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి. ఆయన తమ్మిడిహట్టి నుంచి తీసుకుంటానని చెప్పారు. ఇదో కుట్ర. ప్రధాన గోదావరిపైకి తెలంగాణను రానివ్వరు. తమ్మిడిహట్టి నుంచి కిందికి 100-150 టీఎంసీలు ధవళేశ్వరం వెళ్లాలి. తెలంగాణను అక్కడ ముట్టుకోనివ్వరు’ అన్నారు.
‘మేం ఏం చేశామంటే.. మా ఇంజినీర్లకు చెప్పి సర్వేలు చేయించడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సబ్సిసిడరీగా ఉండే వ్యాప్కోస్ను పిలిపించాం. నేను డిజైన్ చేయలేదు. వ్యాప్కోస్ కంప్లీట్‌గా సర్వే చేసింది. వారికి డబ్బులు పే చేశాం. చివరలో ఏమన్నారంటే ఖచ్చితమైన సర్వే వివరాలు రావాలంటే.. లైడార్ సర్వే చేయించాలని చెప్పారు. అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకొని అప్పుడు రూపకల్పన చేశాం. వీటికి సంబంధించి లారీల కొద్ది ఫైల్స్ ఉంటాయ్. ఆ తర్వాత వాళ్లు చెప్పింది ఏంటంటే.. తమ్మిడిహట్టి వద్ద తీసుకోవడం తప్పు. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కడ తీసుకోవాలంటే ప్రాణహిత తర్వాత తీసుకోవాలి. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత తీసుకోవాలని మేడిగడ్డ వద్ద. ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో ఎక్కడ చిన్న ఆనకట్ట కూడా కట్టలేదు. డైరెక్ట్‌గా ఎస్పారెస్పీ నుంచి ధవళేశ్వరం వరకు ఎక్కడా చుక్క నీరు ఆగదు. కాటన్ దొర దుమ్మగూడెం వద్ద కట్టిన చిన్నది తప్ప ఎక్కడా ఏం లేదు. దుమ్ముగూడెంతో తెలంగాణకు ప్రయోజనం జరిగింది లేదు.
‘దేవాదుల కట్టామని చెప్పిన తెలుగు దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు.. వాళ్లు చేసిన ప్రయత్నంలో కూడా నీళ్లు పోతున్నా ఆనకట్ట కూడా కట్టలేదు. గోదావరిలో నీళ్లుపోతయ్ కానీ.. దేవాదులకు నీళ్లు రావు. ముఖ్యమంత్రిగా నేను అయ్యాక నీళ్లు ఎలా తీసుకోవాలంటే.. తక్కువ ముంపుతో తీసుకొని.. వరద సమయంలో వచ్చిన వాటిని తీసుకొని వాడుకోవాలనేది స్ట్రాటజీ. దానికి మూడు బ్యారేజీలు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరును పూర్తి చేయాలి. ఒక బ్యారేజ్ నుంచి మరో బ్యారేజ్‌కి తీసుకుంటూ.. గోదావరిని సజీవం చేసుకుంటూ నీళ్లను గడ్డ మీదుకు తెచ్చుకోవాలి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు-అన్నపూర్ణ-రంగనాయకసాగర్-మల్లన్నసాగర్-కొండపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ప్రతి స్టేజీలో లక్షల ఎకరాల్లో నీళ్లు వస్తయ్. మిడ్‌మానేరు ఎస్సారెస్పీ పాత ఆయకట్టుకు నీరిస్తది. అప్పర్ గోదావరి నుంచి బాబ్రీ తదితర అనేక చెక్‌డ్యామ్‌లు కట్టుకొని నీళ్లు తీసుకుంటుంది. తెలంగాణ రాక ముందు, కాళేశ్వరం లేకముందు కనీసం పది-14 సంవత్సరాలు శ్రీరాంసాగర్ ఎండిపోయింది. అప్పుడు మేము ఏం ఆలోచించామంటే.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరుకు కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సరఫరా చేయాలని నిర్ణయించాం. ఎస్సారెస్పీ ఆయకట్టు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత పాత మెదక్ జిల్లా. సింగూరు నుంచి నిజాంసాగర్‌కు వెళ్లి నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటది. ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో ఆయకట్టు సేఫ్‌గా ఉంటుంది. అలా 40లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఢోకా లేదు’ అని వివరించారు.