Sachin Pilot | తొలి దశ పోలింగ్లో బీజేపీకి ఎదురుదెబ్బ : సచిన్ పైలట్
Sachin Pilot : లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అంచనా వేశారు.
Sachin Pilot : లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అంచనా వేశారు. తొలి దశ పోరులో కాంగ్రెస్, యూడీఎఫ్, విపక్ష ఇండియా కూటమి మెరుగైన సామర్ధ్యం కనిపించిందని తనకు గట్టి విశ్వాసం ఉందని అన్నారు. తొలి దశ పోలింగ్లో బీజేపీ వెనుకంజ వేసినట్టు స్పష్టంగా వెల్లడైందని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాషాయ పార్టీ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను విభజించే అంశాలు ఎలాంటి ప్రయోజనాలు అందించవని పైలట్ బీజేపీకి హితవు పలికారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, తొలి దశ పోలింగ్ నిరాశపరిచిందనే విషయం వారు పసిగట్టారని చెప్పారు.
అందుకే బీజేపీ నేతలు మతం గురించి మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరిచేందుకు హిందూ-ముస్లిం అంటూ విభజన చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. ఇక కేరళలో ప్రజల ఆశీస్సులతో తాము మొత్తం 20 స్ధానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదు.. ఆయన అందరివాడు : కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

