రాహుల్‌కు గర్ల్‌ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?

ముంబై: ఇండియన్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆదివారం తన 29వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వేల మంది అభిమానులు అతనికి విషెస్ చెబుతున్నారు. అయితే అందులో అతియా శెట్టి విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఆమె రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ కాబట్టి. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అతనితో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు ఈ ఫొటోలు ఎప్పుడూ బయటపెట్టలేదామె.
దీనిపై అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించడం విశేషం. గ్రేట్ఫుల్ ఫర్ యు, హ్యాపీ బర్త్ డే అని అతియా చేసిన పోస్ట్‌పై సునీల్ స్పందిస్తూ.. నిజంగానే అంటూ ఓ బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. మై క్యూటీస్ అంటూ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా అతియా పోస్ట్‌పై కామెంట్ చేశాడు.
ఈ ఇద్దరూ ఒకరి బర్త్‌డేలకు ఒకరు విషెస్ చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకూ తమ రిలేషన్‌షిప్‌పై బయటపడలేదు. అయితే అతియా తండ్రి సునీల్ శెట్టి మాత్రం ఇప్పటికే వీళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. తనకు, తన భార్య మనా శెట్టికి తమ పిల్లలు, వాళ్లు డేటింగ్ చేసిన వాళ్లంటే ఇష్టమని చెప్పాడు.
ఇవి కూడా చదవండి
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్‌రైజర్స్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్‌కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

