BRS President KCR | తెలంగాణపై తన ఆనవాళ్లను తొలగించలేరని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ‘మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టించిందే.. యాదాద్రి కూడా నేను నిర్మించిందే. మంగళవారం టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తెలంగాణను అస్థిర పరిచేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎడారి కావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. కాంగ్రెస్ నాటకాలు ప్రజలకు తెలిసి పోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అని స్పష్టం చేశారు.