Warning: include(/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-middle-widget-news.php): failed to open stream: No such file or directory in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 115
Warning: include(): Failed opening '/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-middle-widget-news.php' for inclusion (include_path='.:/usr/share/php') in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 115
Warning: include(/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-right-widget.php): failed to open stream: No such file or directory in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 116
Warning: include(): Failed opening '/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-right-widget.php' for inclusion (include_path='.:/usr/share/php') in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 116
Warning: include(/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-left-widget.php): failed to open stream: No such file or directory in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 117
Warning: include(): Failed opening '/var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/widgets/top-news-left-widget.php' for inclusion (include_path='.:/usr/share/php') in /var/www/html/ntnews_15277/public/wp-content/themes/Ntnews/functions.php on line 117 Ramaayanam | పొరపాటేగా..-Namasthe Telangana
HomeStoriesRamaayanam By Writer Nellutla Ramadevi Part 22 02nd April 2023
Ramaayanam | పొరపాటేగా..
Ramaayanam | తెలిసీ తెలియని వయసులో చుట్టుపక్కల మనుషుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అనాలోచితంగా మనమూ అదే మూసలో కొట్టుకు పోతుంటాం. ఏదో ఓ సమయంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనేవిషయాన్ని గుర్తిస్తాం. నాన్న కర్ర దెబ్బలు, అమ్మ చివాట్లు.. జీవితానికి అవసరమైన అతిగొప్ప పాఠాలు నేర్పుతాయి. నా బాల్యంలోనూ ఇలాంటి ఓ సంఘటన జరిగింది.
Ramaayanam | తెలిసీ తెలియని వయసులో చుట్టుపక్కల మనుషుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అనాలోచితంగా మనమూ అదే మూసలో కొట్టుకు పోతుంటాం. ఏదో ఓ సమయంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనేవిషయాన్ని గుర్తిస్తాం. నాన్న కర్ర దెబ్బలు, అమ్మ చివాట్లు.. జీవితానికి అవసరమైన అతిగొప్ప పాఠాలు నేర్పుతాయి. నా బాల్యంలోనూ ఇలాంటి ఓ సంఘటన జరిగింది.
మాఊర్లో రెండు, మూడిళ్ల వాళ్లం తప్ప మిగతా అందరూ విద్యాగంధం అంటని వాళ్లే! ఎక్కువమంది వ్యవసాయం, తక్కినవాళ్లు చేతివృత్తులు చేసుకునే వాళ్లు. దీంతో ఆ భాష మోటుగా ఉండేది. బూతులూ, సరసాలూ, పరాచికాలూ.. సర్వసాధారణం. మాటకొకటి చొప్పున జోడించాల్సిందే. అప్పట్లో మాకు పెద్దగా వాటి అర్థాలు తెలియకపోయినా.. ఏదో తేడాగా అనిపించేది. వాళ్ల పిల్లలు మాతోపాటూ చదువుకోవడానికి వచ్చినా.. అదే భాష మాట్లాడేవారు. ఆ బూతులే ఎత్తుకునేవారు.
ఉదాహరణకు ఒక యువతి వరుసకు మామ అయ్యే వ్యక్తితో.. “ఏంది మామా! వారం దినాల సంది కనబడ్తలేవు.. సచ్చిపోయినవనుకున్న! బతికే ఉన్నవా?!” అనేది నవ్వుతూ. అతను కూడా వెంటనే.. “ఆఁ! సచ్చిపోదామనే అనుకోని పోయిన. నువ్వు యాదికచ్చి మల్లచ్చిన. సత్తె ఇయ్యాల్టికి అయిదు దినాలవు!” అనేవాడు అంతే నవ్వు మొహంతో. చేలల్లో నాట్లు, కలుపులప్పుడు ఎవరైనా మగవాళ్లు మోటు సరసాలాడితే..
ఆడవాళ్లు ఏ మాత్రం భయపడకుండా దీటుగా.. “ఓయ్! ఎక్వ తక్వ మాట్లాడితె పండ్లు రాలగొడ్త!
దవుడలు దగ్గరికి ఒత్తుత! ఏమనుకుంటానవ్ లం.. కొడుకా! ఈసారి నా దగ్గరికస్తే జూడు శెవులు పీకి శేతుల బెడ్త!” అని జవాబిచ్చేవారు. ఎదుటి మనిషి కూడా ఆ బూతుపురాణాన్ని, తిట్లదండకాన్ని చిరునవ్వుతో స్వీకరించేవాడు. డోసు తగ్గకుండా స్పందించేవాడు. మా బడిలో చిన్నపిల్లలు కూడా అవలీలగా దుర్భాషలాడేవారు. ఒకడి బలపమో, పెన్సిలో ఇంకొకడు తీసుకుంటే చాలు.. “అరేయ్! నా బలపం నాకు ఇయ్యకుంటె నీ బొక్కలిరగ్గొడుత!”; “నా గోలీలు నువ్వే తీసినవుర, నాయి నాకు ఇయ్యకుంటె నిన్ను పండబెట్టి తొక్కుత!”; “నిన్ను బొందబెడ్త! నీ ముక్కు పలగ్గొడుత!”.. ఇలాంటి మాటలు సర్వసాధారణం.
నాకు సుమారు నాలుగైదు సంవత్సరాలు ఉంటా యప్పుడు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన బాగా గుర్తుంది. అప్పట్లో మా ఇంట్లో ఇంకా రేడియో లేదు. ఇంటి ఎదురుగా గ్రామపంచాయతీ ఆఫీసులో ఉన్న రేడియోను ఒకాయన వచ్చి పొద్దున ఆరింటికి ఆన్ చేసి వెళ్తే.. పదకొండింటి దాకా అది వాగుతూనే ఉండేది. ఒక్కోసారి ఆయన సమయానికి తిరిగి రాకపోతే.. అది అలాగే ‘కుక్.. కుక్..’ అని శబ్దాలు చేస్తూ, మళ్లీ పన్నెండింటికి ప్రసారాలు మొదలయ్యాక వినిపించేది.
నాన్నకు వార్తలు వినడం ఇష్టం. మాకేమో పాటలు వినడం సరదా. ఓ సారి నాన్న శ్రద్ధగా పంచాయతీ రేడియోలో వార్తలు వింటున్నాడు. మేము అక్కడే దగ్గర్లో ఆడుకుంటున్నాం. పెద్దగా అరుస్తూ, నవ్వుతూ గోల చేశామేమో! నాన్నకు వార్తలు సరిగ్గా వినపడక.. “ఎహె! లొల్లి జెయ్యకుండి. ఏమి ఇనొస్త లేదు. బైటికిపొయ్యి ఆడుకోండి” అంటూ కసిరాడు. నాన్న అంతవరకూ ఎప్పుడూ మమ్మల్ని కోప్పడ్డం గానీ, కటువుగా మాట్లాడ్డం గానీ చేయలేదు గనుక.. నాకు ఉక్రోషం వచ్చి వెంటనే.. “ఊరికే వార్తలు.. వార్తలు! పాటలు బాగుంటయ్. మంచోళ్లయితె పాటలు ఇనాలె గానీ, పిచ్చి ముం.. కొడుకులే వార్తలింటరు” అన్నాను అనాలోచితంగా. ఆ మాట తప్పనీ, పెద్ద వాళ్లను అలా అనగూడదనీ.. అసలు ఎవరిపట్లా అలాంటి మాటలు ప్రయోగించకూడదనీ తెలియని నాలుగైదేళ్ల వయసు!
అంతే! నాన్న మొహంలో రంగులు మారాయి. చాలా కోపం వచ్చింది. ఉన్నపళంగా పైకి లేచి.. “ఏమన్నవ్? అసలు ఎక్కడ నేర్చుకున్నవ్ ఇట్లాంటి మాటలు? నీకు నాలుగు తన్నులు పడాలె!” అంటూ ఓ పెద్ద కర్ర అందుకుని నన్ను కొట్టడానికి వచ్చాడు. నాన్నను ఎప్పుడూ అంత కోపంగా చూడని నేను, భయంతో బాత్రూమ్లోకి పరిగెత్తి మునివేళ్ల మీద నిలబడి గొళ్లెం పెట్టాను. కాసేపు నాన్న దబాదబా తలుపు కొట్టాడు. అంత దుఖంలోనూ నేను గొళ్లెం తీయలేదు. ఇంతలో ఇంటిల్లిపాదీ చేరారు. అమ్మ రెండు మూడు సార్లు పిలిచింది. నేను అస్సలు తలుపు తీయలేదు. కాసేపటికి నాన్న కోపం చల్లారింది. “ఏమననులే! బైటికి రా!” అని పిలిచాడు. ఒకటిరెండు సార్లు బతిమాలుకున్నాక కానీ నా మనసు కరగలేదు.
కానీ, తీరా చూస్తే నాకు తలుపు గొళ్లెం అందట్లేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. నాకు భయమేసి అదేదో నానమ్మ చెప్పే కథలో రాక్షసుడు ఒంటి స్తంభం మేడలో బంధించిన రాజకుమారిలా ఏడుస్తూ.. పాటలు పాడుకుంటూ ఉండాలేమో అని మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాను.
అమ్మ తలుపు దగ్గరగా వచ్చి నన్ను బుజ్జగించి.. “ఏం ఆగం కాకు బిడ్డా! అక్కడ రెండు ఇటుకలున్నయ్.. మెల్లగ ఒకదాని మీద ఒకటి వేసుకొని వాటి మీదెక్కి గొళ్లెం తీసుకో!” అని చెప్పింది. అలాగే చేశాను. మొత్తానికి బయటపడి ఊపిరి పీల్చుకున్నాను. బయటికొచ్చాక అమ్మా, నాన్నా.. నన్ను ఎత్తుకుని ముద్దాడారు. ఆ తరువాత అమ్మ నన్ను కూర్చోబెట్టి ఓ గంట క్లాస్ పీకిందనుకోండి. అది వేరే సంగతి! అప్పట్నుంచి ఎవర్నీ, ఎప్పుడూ.. పరుషంగా అనొద్దనీ, ఏ మాట పడితే అది అర్థంపర్థం లేకుండా వాడొద్దనీ.. ఒక పాఠం నేర్చుకున్నాను. ఆ భాషా సంస్కారం వృత్తి జీవితంలోనూ ఉపయోగపడింది. నొప్పింపక తానొవ్వక అన్నట్టు.. చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పడమే నా నైజం. కాబట్టే, అందరి తలలో నాలుకలా మెలగ గలిగాను.