6న మలేషియాలో ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 6న అట్టహాసంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా(బీఏఎం), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
- బీఏఎం, మైటా ఆధ్వర్యంలో ఏర్పాట్లు
- హాజరుకానున్న మాజీ మంత్రి కేటీఆర్
- వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలిరానున్న తెలంగాణ ఎన్నారైలు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 6న అట్టహాసంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా(బీఏఎం), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, అమరవీరుల స్మారక చిహ్నాల నమూనాలతో వేదికను తీర్చిదిద్దనున్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని నిర్వాహకుడు, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా ప్రెసిడెంట్ మారుతి తెలిపారు.
వేడుకల్లో రెండు తెలంగాణ ఎన్నారై యూనియన్లతోపాటు మొత్తం ఎనిమిది తెలుగు సంఘాలు ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నాయని వెల్లడించారు. మరో 9 యూనియన్లు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా పలు ఆగ్నేయాసియా దేశాల నుంచి 2,500 మంది తరలిరానున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలను ప్రదర్శించనున్నట్టు వివరించారు. కాగా, కార్యక్రమ విజయవంతంపై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు మహేశ్ బిగాల దృష్టిసారించారు. దీనిపై నిర్వాహకులతో సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

