శ్రీనివాసరావుకు కేసీఆర్ నివాళి
అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది, జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు.
- అంత్యక్రియల్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు
- శోకసంద్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్
- కుటుంబసభ్యులు, పలువురు నేతలు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది, జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్.. శ్రీనివాసరావు పార్థివదేహం వద్దకు చేరుకొని పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శ్రీనివాసరావు భార్య, పిల్లలను కేసీఆర్ పరామర్శించారు.
‘మేమంతా అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి’ అని కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోదరుడి మృతితో విషాదంలో ఉన్న తన సతీమణి శోభమ్మను కూడా కేసీఆర్ ఓదార్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. మేనమామ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు సుచిత్రకు చేరుకొని శ్రీనివాస్‌రావు భౌతికకాయానికి నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం తిరుమలగిరిలోని స్వర్గ వాటికలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు ముగిశా యి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్, ఎం పీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇం ద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

