కోహీర్, జూన్3: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచెర్యాగడి తండా శివారులో ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర పోలీసులు దాడి చేశారు. ముంబై, తదితర ప్రాంతాలకు చెందిన ఓ ముఠా సభ్యులు పీచెర్యాగడి శివారులో డ్రగ్స్ తయారుచేయడానికి ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందడంతో వారు సోదాలు నిర్వహించారు. రూ.6.22కోట్ల విలువైన ల్యాబ్ పరికరాలు, రూ.22కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రసాయనాలను సీజ్ చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించారు.