అక్రమ దందాలు నియంత్రించలేరా?
పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను అరికట్టడం, వడ్ల కొనుగోలులో తరుగు దోపిడీని నియంత్రించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు.
- మట్టి మాఫియా, వడ్ల తరుగు దోపిడీని పట్టించుకోరేందుకు?
- పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి, జూన్3: పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను అరికట్టడం, వడ్ల కొనుగోలులో తరుగు దోపిడీని నియంత్రించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు.
నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి మాఫియా చెలరేగిపోతున్నదని మండిపడ్డారు. అధికారుల అండదండలతో సాగుతున్న మట్టి మాఫియా దందాను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ధాన్యాన్ని కట్ చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఆ తరుగు డబ్బులను తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో బండి ప్రకాశ్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

