కొండాపూర్, ఆగస్టు 12 : మానవ వనరుల సేవా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన క్యాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌నకు ఆయన ప్రచారకర్తగా కూడా కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్, సంస్థ చైర్మన్ డాక్టర్ సీఆర్ నాయుడు మాట్లాడుతూ… యాప్ ద్వారా బ్యూటీ, క్లీనింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ సర్వీసింగ్, కార్పెంటర్, పెస్ట్ కంట్రోల్ తదితర గృహ సేవలను పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన సిబ్బందితో అందించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభమైన సేవలను త్వరలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేరొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.