టీకా సక్సెస్

12 సెంటర్లలో 730 మందికి కరోనా టీకా
సజావుగా సాగిన ప్రక్రియ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
కరోనా మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా 12 సెంటర్లలో కరోనా నివారణ టీకా వేశారు. మొత్తం 730 మందికి టీకా వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంత మైందని అధికారులు తెలిపారు. పుల్లూరు పీహెచ్సీలో వ్యాక్సినేషన్‌ను అదనపు కలెక్టర్ ముజమ్మీల్‌ఖాన్ పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్,ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
-సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 18 :
గజ్వేల్‌అర్బన్/గజ్వేల్‌రూరల్/వర్గల్/జగదేవ్‌పూర్,జనవరి 18: గజ్వేల్ ఏరియాలో నాలుగు వ్యాక్సినేషన్ కేంద్రాలను సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం గజ్వేల్ పట్టణంలోని జిల్లా దవాఖానలో ప్రారంభం కాగా, సోమవారం వర్గల్, జగదేవ్‌పూర్ పీహెచ్‌సీలతో పాటు అహ్మదీపూర్ పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వర్గల్ పీహెచ్సీ దవాఖానలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ లతా రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ బాలుయాదవ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అహ్మదీపూర్‌లో ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి శ్యాంమనోహర్, జడ్పీటీసీ పంగ మల్లేశం ప్రారంభించగా, జగదేవ్‌పూర్ పీహెచ్సీ కేంద్రంలో ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్‌గౌడ్ ప్రారంభించారు. ప్రతి సెంటర్లో 50మందికి చొప్పున వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రత్యేకాధికారి గోపాలరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగా,గజ్వేల్ జిల్లా దవాఖానలో ప్రోగ్రాం అధికారి శ్రీదేవి, నోడల్ అధికారి మహిపాల్, దవాఖాన సూపరిండెంటెంట్ మహేశ్ పర్యవేక్షించారు.
సీఎం కేసీఆర్ విశేష కృషి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, జనవరి 18 : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణితో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొవిడ్ నివారణ వ్యాక్సిన్ మొదటగా దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ తీసుకోగా, అనంతరం 49 మంది దవాఖాన వైద్యసిబ్బంది తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమంలో వార్డులు, వీధులు, డ్రైనేజీలు శుభ్రం కావడంతో ప్రజారోగ్యం మెరుగుపడిందన్నారు. కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య, పోలీస్, రెవెన్యూ సిబ్బంది అందించిన సేవలు మరువలేనివన్నారు. వారు తమ ఇండ్లకు సైతం వెళ్లకుండా రోజుల పాటు దవాఖానలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించారని, వారికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాక్సిన్ మన హైదరాబాద్‌లో తయారు కావడం మనందరికీ గర్వకారణమని, ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్లు సైతం తెలంగాణలో ఎక్కువ శాతం తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు ముస్త్యాల తారయాదగిరి, పచ్చిమడ్ల సతీష్, ఆడెపు నరేందర్, రైతుబంధు సమితి సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, యూత్ జిల్లా నాయకుడు శివగారి అంజయ్య, పుర్మ వెంకట్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, మంచాల కొండయ్య, కో-ఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అంజనీదేవీ, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్దూరులో..
మద్దూరు పీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ మేక సంతోష్, వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం,పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ సుధారాణి, స్థానిక సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, ఎంపీటీసీ బొప్పె కనుకమ్మ తదితరులు పాల్గొన్నారు.
కరోనాను తరిమికొడదాం
ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
హుస్నాబాద్, జనవరి 18 : ప్రజలందరూ విధిగా టీకా తీసుకొని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో కరోనా వాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే సమక్షంలో మొదటి టీకాను కాంటింజెంట్ వర్కర్ కిష్టయ్య తీసుకోగా, రెండో టీకా ను కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి రామ్మూర్తి తీసుకున్నారు. మూడోది కాంటింజెంట్ వర్కర్ కనకలక్ష్మికి ఇచ్చారు. హుస్నాబాద్ పరిధిలో 356మంది కరోనా వారియర్స్‌కు టీకాలు వేస్తారని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కమిషనర్ రాజమల్లయ్య, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ మానస, జడ్పీటీసీ భూక్య మంగ, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మార్కెట్ చైర్మన్ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం