ఎర్రగడ్డ, ఏప్రిల్ 25: పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని(BRS party) మరింత బలోపేతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath) అన్నారు. బోరబండలోని పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాగంటి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలతో మమేకమై డివిజన్లోని అన్ని బస్తీలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రజల సమస్యలతో పాటు పార్టీ శ్రేణుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు ఘన విజయానికి అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, ఆనంద్, యూసుఫ్, బాబూరావు, ధర్మ, సాయి, దేవమణి, అజేయ, మేరీ, వెంకటేష్, రామకృష్ణ, రవీందర్, లడ్డు, అమర్ తదితరులు పాల్గొన్నారు.