వైభవంగా యాదగిరీశుడికి లక్షపుష్పార్చన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ సందడిగా మారాయి.
- వరుస సెలవులతో భక్తులతో కిటకిటలాడిన యాదగిరి గుట్ట ఆలయ ప్రాంగణం
యాదగిరిగుట్ట, మార్చి15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీవీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.
సుమారు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 52,06,106 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. స్వామివారి ప్రధానాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది.
స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆసీనులుగావించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు.
తెల్లవారు జామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా సాగాయి. లక్షపుష్పార్చన వేడుకల్లో దేదాదాయ ధర్మదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

