సిద్దార్థ్..పేరుకు తమిళ హీరో.. కానీ 15 ఏళ్ల కింద తెలుగు హీరోలు కూడా మనసులో కుళ్ళుకొనే స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న హీరో. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర అభిమానులను సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్. శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో..ప్రభుదేవా దర్శకుడిగా మారి చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో స్టార్ అయ్యాడు. 2005 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ వెంటనే చుక్కల్లో చంద్రుడు ఫ్లాప్ అయిన కూడా బొమ్మరిల్లు సినిమా సిద్ధును ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చేసింది. అప్పట్లో తెలుగు హీరోలు కూడా ఈయనకు ఉన్న ఫాలోయింగ్ చూసి మనసులో కచ్చితంగా కుళ్లుకునేవాళ్లు.
మరీ ముఖ్యంగా అమ్మాయిలలో ఈయనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే బొమ్మరిల్లు తర్వాత ఈయన నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మాత్రమే పర్లేదు అనిపించింది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా రాలేదు. అందుకే పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయిపోయాడు సిద్ధార్థ్. ఆయన నటించిన చివరి సినిమా ఓ మై ఫ్రెండ్ విడుదలై దాదాపు 9 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇందులో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు సిద్ధూ. ఇదిలా ఉంటే దీనికోసం ఈయన తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగులో పూర్తిగా పేడ్ అవుట్ అయిపోయాడు అనుకుంటున్న సిద్ధార్థ్‌కు ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న చాలామంది తెలుగు కుర్ర హీరోలు కూడా ఈ రెమ్యునరేషన్ అందుకోవడం లేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా కూడా అదే రేంజ్ పారితోషికం అందుకుంటున్నాడు. ఒకవేళ మహాసముద్రం హిట్టయితే తెలుగులో మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు కూడా. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
‘బాలీవుడ్ బేబీ’గా మారిన రష్మిక..!
చర్మ సమస్యల నివారణకు తమన్నా చిట్కా ఇదే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన