సోమవారం 26 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Aug 07, 2020 , 03:52:08

మార్కెట్‌ కమిటీల ఎంపిక

మార్కెట్‌ కమిటీల ఎంపిక

  • ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపిన  సభ్యులు 
  • సమస్యలు పరిష్కరిస్తామని హామీ

మల్లాపూర్‌ : మండల వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా మండలంలోని గొర్రెపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కదుర్క నర్సయ్యను నియమిస్తూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్‌ చైర్మన్‌గా ముద్దం శరత్‌గౌడ్‌, సభ్యులుగా భైరి రాకేశ్‌ , రజాక్‌ , ఏనుగు లక్ష్మారెడ్డి, నల్ల గంగమల్లయ్య, దేవేందర్‌, పెద్దిరెడ్డి లక్ష్మణ్‌ , లక్ష్మీనారాయణ, ఉమారాణి ని యమితులయ్యారు. మల్లాపూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌గా నర్సారెడ్డి ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ కదుర్క నర్సయ్య మా ట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించడంపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

కోరుట్ల పాలక వర్గం నియామకం

కోరుట్ల : కోరుట్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గాన్ని గురువారం నియమించారు. ఏఎంసీ ఆధ్యక్షురాలిగా లక్ష్మి, ఉపాధ్యక్షుడిగా మోహన్‌రెడ్డి, సభ్యులుగా రమే శ్‌, సురేందర్‌, లక్ష్మణ్‌, వెంకటస్వామి, సురేందర్‌రా వు, అంబేద్కర్‌,  శ్రీనివాస్‌, రహమాన్‌ నియమితులయ్యారు. 

ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ..  

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమించారు. ఏఎంసీ అధ్యక్షురాలిగా సరస్వతి, ఉపాధ్యక్షుడిగాదశరథరెడ్డి, సభ్యులుగా చిన్న రాజన్న, షేక్‌ వాహెబ్‌ఖాన్‌, నర్సయ్య, నవీన్‌కుమార్‌, లింబాద్రి, రమేశ్‌ నాయక్‌, ప్రదీప్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ  సందర్భంగా సభ్యు లు మాట్లాడారు. తమ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలు పరిష్క రిస్తామని హామీ ఇచ్చారు. 


logo