మెదడు మనిషిలోని గొప్ప అవయవం.. జ్ఞానేంద్రియాలకు ముఖ్యమైన కేంద్రం. దాని సామర్థ్యాన్ని పెంచుకుంటే వ్యక్తి జీవనం, భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిందే ‘బ్రైటర్ మైండ్స్’. శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఏటా యోగ, ధ్యానం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం పిల్లల్లో మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతున్నది. ఇందులో భాగంగా కండ్లతో చూడకుండానే పేపర్‌పై చిత్రాన్ని గుర్తించడం.. శబ్ధం ఆధారంగా వస్తువును తెలుసుకోవడం.. కేవలం వాసన, స్పర్శతో రంగులను కనిపెట్టడం లాంటి విభిన్న ప్రక్రియలపై పట్టు సాధించిన వారిలో ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చనే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతున్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో బ్రైటర్ మైండ్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న చిన్నారులను గుర్తించి, పది రోజుల్లో భవిష్యత్తుకు సరిపడా శిక్షణ ఇచ్చి పంపుతున్నారు. నేడు విస్తరించిన సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, టీవీ ప్రభావంతో మనిషి మెదడుపై ఏర్పడే తీవ్ర ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలో నేర్పుతూ, పోటీ ప్రపంచంలో రాణించేలా చిన్నతనం నుంచే బంగారు బాటలు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా బద్దకం, మొండితనం, భయం, మొహమాటం, కోపం లాంటి భావోద్వేగాలను అధిగమించి లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ప్రత్యేక తరగతులు ఎంతో ఉపకరిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.
సాధారణంగా అంధులు స్పర్ష ద్వారా వస్తువులను గుర్తిస్తారు. అయితే బ్రైటర్ మైండ్స్ శిక్షణ పొందిన విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని కేవలం వాసన, వినికిడి, స్పర్శ ద్వారా రంగులు, వస్తువులు గుర్తించడం, చిత్రాలు వేయడం, సింగిల్, డబుల్ డిజిట్ నంబర్లు గుర్తించడం, ఆకారాలను వేర్వేరుగా పెట్టడం, రాసిచ్చిన అక్షరాలు చదవడం లాంటివి సులువుగా చేయగలుగుతారు. మెదడుకు వ్యాయామం, ప్రాణాయామం, యోగా, జ్ఞాపక శక్తి పెంచుకునే మెళకువలను వివరిస్తూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఆయా అంశాల్లో తర్ఫీదు ఇస్తారు.
క్లాస్‌లకు ఆసక్తిగా ఎంతో హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న. ఇక్కడ తెలియని చాలా విషయాలు నేర్పించారు. సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉంటూ, ప్రతి రోజూ మనం లేచింది మొదలు, పడుకునే వరకు ప్రతి విషయాన్ని కొత్తగా ఈ శిక్షణలో నేర్పించారు. చాలా కొత్త విషయాలు తెలిశాయి. మా పేరెంట్స్ నన్ను చూసి చాలా సంతోషిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో బ్యాచ్‌కు 20 నుంచి 30 మంది విద్యార్థులకు పది రోజుల పాటు శిక్షణ ఇస్తున్నం. ఈ శిక్షణలో ప్రత్యేకంగా విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచి వారు సాధన చేసినన్ని రోజులు ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవడం సాధ్యమయ్యేలా తీర్చిదిద్దుతం. ఈ శిక్షణ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది. ఈ శిక్షణ తర్వాత తల్లిదండ్రులు పిల్లల్లో మార్పును స్పష్టంగా చూస్తారు.
రామచంద్రమిషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్‌కు బ్రైటర్ మైండ్స్ శిక్షణ ఇస్తున్నం. మాకు వచ్చే దరఖాస్తులు సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మరో రెండో బ్యాచ్‌లను అనుమతించాం. చిన్నారులకు ధ్యానం, వ్యాయామం, యోగా లాంటి కార్యక్రమాలతో వారిలోని మానసిక ఒత్తిడి దూరం చేయడమే మా ముఖ్య ఉద్దేశం.
నేను తొమ్మితో తరగతి చదువుతున్న సమయంలో వేసవి సెలవుల్లో ఈ శిక్షణకు వచ్చా. ఈ శిక్షణ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్న. పదో తరగతి పరీక్షలు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా రాయగలిగా. ఈ సంవత్సరం శిక్షణకు వచ్చే విద్యార్థులకు సలహాలు ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చా.