Tariffs : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. మెక్సికో (Mexico) తోపాటు యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
ఈ పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్.. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్కు, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్లకు లేఖలు రాశారు.