Car accident : కారు (Car) నడుపుతూ డ్రైవర్ (Driver) నిద్రలోకి జారుకోవడంతో ఆ కారు అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్ (Bihar) లోని పాలిగంజ్ ఏరియా (Paliganj area) లో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో రాణితలాబ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరైయా గ్రామం సమీపంలో కారు కాలువలోపడింది. కారు కాలువలో పడగానే గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి అందరినీ కారులోంచి బయటకు తీశారు.
వారిని ఆస్పత్రికి తరలించగా అందులో ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.