Farmer | కరెంట్ షాక్తో యువ రైతు మృతి.. నారాయణపేట జిల్లాలో విషాదం
Farmer | నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాగనూరు మండలం అచ్చంపేట గ్రామంలో ఓ యువరైతు కరెంటు షాక్తో మృతిచెందాడు.
Farmer | మాగనూరు, మార్చి 07: నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాగనూరు మండలం అచ్చంపేట గ్రామంలో ఓ యువరైతు కరెంటు షాక్తో మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట గ్రామానికి చెందిన యువ రైతు బచ్చి దేవప్ప (32) శుక్రవారం రాత్రి తమ పొలానికి వెళ్లాడు. మోటార్ స్టార్టర్లో కరెంటు ప్రాబ్లెం వస్తుండటంతో దాన్ని సరిచేయబోయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే దేవప్ప ప్రాణాలు విడిచాడు. అయితే రాత్రి పొలానికి వెళ్లిన దేవప్ప.. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. అనుమానంతో శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. దేవప్ప విగతజీవిగా కనిపించాడు. మృతుడు దేవప్పకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
దేవప్ప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న దేవప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

