Shivanna | హీరోయిన్లను వస్తువుల్లా చూపించొద్దు… సప్తమి గౌడ ఉద్యమానికి శివన్న మద్దతు
Shivanna | సినిమా ప్రచార కార్యక్రమాలు, ఆడియో లాంచ్‌లు, అవార్డు వేడుకలు వంటి పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు తీయడం సాధారణమే. అయితే ఇటీవల కొంతమంది ఫోటోగ్రాఫర్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు హీరోయిన్లను అనుచిత కోణాల్లో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Shivanna | సినిమా ప్రచార కార్యక్రమాలు, ఆడియో లాంచ్‌లు, అవార్డు వేడుకలు వంటి పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు తీయడం సాధారణమే. అయితే ఇటీవల కొంతమంది ఫోటోగ్రాఫర్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు హీరోయిన్లను అనుచిత కోణాల్లో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అవసరం లేకపోయినా కెమెరాలను జూమ్ చేసి వారి శరీర భాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై కన్నడ నటి సప్తమి గౌడ తీవ్రంగా స్పందిస్తూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంతారా చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సప్తమి గౌడ ఇటీవల సోషల్ మీడియాలో ఈ సమస్యపై గట్టిగా స్పందించారు. మహిళా కళాకారులను వస్తువులుగా చూడకుండా వారి ప్రతిభను గౌరవించాలని ఆమె స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వకంగా కెమెరాను జూమ్ చేసి అనుచిత కోణాల్లో చిత్రీకరించడం తమ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మేము మా పనికోసం ఇక్కడ ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా కెమెరాలను జూమ్ చేసి అనుచితంగా చిత్రీకరించడం మా గౌరవానికి భంగం కలిగిస్తుంది” అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో #ActorsNotObjects అనే హ్యాష్‌ట్యాగ్‌తో నటీమణులను వస్తువుల్లా కాకుండా కళాకారులుగా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. సప్తమి గౌడ ప్రారంభించిన ఈ ఉద్యమానికి కన్నడ చిత్రసీమ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ ఆమెకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన మహిళలను గౌరవించడం మన సంస్కారంలో భాగమని చెప్పారు. నటీమణులను కేవలం శరీరంగా చూసే ధోరణి వెంటనే ఆగిపోవాలని ఆయన హెచ్చరించారు.
మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వారిని వస్తువుల్లా చూపించే ప్రయత్నాలను నిలిపివేయాలి” అంటూ #ActorsNotObjects హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శివ రాజ్‌కుమార్ కుమార్తె, నిర్మాత నివేదిత రాజ్‌కుమార్ కూడా స్పందించారు. మహిళలను కేవలం శరీరంగా చూపించడం సమాజంలో పెరుగుతున్న దిగజారుడు ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనను సమాజం సహించకూడదని ఆమె స్పష్టం చేశారు. ఇక సప్తమి గౌడకు మద్దతుగా కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు నటీమణులు ముందుకు వచ్చారు. రుక్మిణి వసంత్, ఆషికా రంగనాథ్ వంటి నటీమణులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఈ సమస్యపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ కార్యక్రమాల్లో మహిళా నటుల ఫోటోలు, వీడియోలను అసభ్యకర కోణాల్లో చిత్రీకరించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

