Pangolin : పంగోలిన్ (Pangolin) అనేది అంతరించిపోతున్న జీవజాతి. దీన్నే మన తెలుగు ప్రజలు అలుగు (Alugu) అంటారు. ఈ జీవుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని అఖ్నూర్ (Akhnoor) లో గిగ్రియాల్ బెటాలియన్ (Gigrial bettalion) పరిధిలోని నియంత్రణ రేఖ (LOC) వద్ద ఆర్మీ జవాన్ల (Army soldiers) కు అలుగు కనిపించింది.
దాంతో ఆర్మీ జవాన్లు ఆ అలుగును రక్షించారు. అనంతరం దానిని ఓ బోనులో బంధించి వైల్డ్ లైఫ్ డిపార్టుమెంట్ అధికారులకు అందజేశారు. ఆర్మీ జవాన్లు అలుగుతో ఉన్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Akhnoor, J&K | Indian Army rescued a rare Pangolin found at the LOC post of the Gigrial Battalion, Akhnoor, and handed it over to the Wildlife Department. pic.twitter.com/vy2n0gbpys
— ANI (@ANI) July 12, 2025