Ustaad Bhagat Singh | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అటు క్రికెట్ ప్రేమికుల్లో, ఇటు సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ కోసం జరుగుతున్న ఈ హోరాహోరీ పోరును కోట్లాది మంది వీక్షిస్తుండగా, ఈ మ్యాచ్ మధ్యలో వచ్చే విరామ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌ను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను స్టేడియంలోని భారీ స్క్రీన్లపై ప్రదర్శించబోతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియంలో టీమిండియా గెలుపు కోసం అభిమానులు ప్రార్థిస్తున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ మాస్ పవర్‌ను వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ ఫీవర్ మరియు పవర్ స్టార్ క్రేజ్ తోడవ్వడంతో #T20WorldCup2026Final, #UstaadBhagatSinghTeaser వంటి హ్యాష్‌ట్యాగ్‌లు నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. క్రికెట్ మైదానంలో ఈ డబుల్ ధమాకా సందడి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి